1. క్లౌడ్ కిచెన్ వ్యాపారం
మీ ఇంట్లోనే ప్రారంభించగలిగే ఈ బిజినెస్ మోడల్ ప్రస్తుతం నగరాలలో బాగా బూస్ట్ అవుతోంది. పెద్ద హోటల్ అవసరం లేదు. ఇంట్లో వండిన తిండి Zomato లేదా Swiggy వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో లిస్ట్ చేయండి. ప్రారంభ పెట్టుబడి రూ.50,000 నుండి రూ.1 లక్షలోపే ఉంటుంది. మంచి రివ్యూలు వస్తే ఆర్డర్లు పెరుగుతాయి, ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది.
2. హోమ్‌మేడ్ టిఫిన్ సర్వీస్
ఇంట్లో తయారు చేసిన తిండి కోసం డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు, బ్యాచిలర్స్ హైజీనిక్ హోం ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికోసం మీరు కిచెన్ టూల్స్, బేసిక్ గ్రోసరీ స్టాక్, టిఫిన్ బాక్స్‌లతో ప్రారంభించవచ్చు. రోజువారీ ఆదాయం వచ్చేలా ఉంటుంది. కస్టమర్లు మెల్లిగా పెరిగిపోతారు.
3. ట్యూషన్ & కోచింగ్ సర్వీసెస్
మీకు బోధనలో నైపుణ్యం ఉంటే ఇంట్లో చిన్న గది నుంచే ట్యూషన్ క్లాస్‌లను ప్రారంభించవచ్చు. బోర్డ్, చెయిర్లు, నోట్లు వంటి బేసిక్ స్టడీ మెటీరియల్‌తో రూ.20,000 – 50,000 పెట్టుబడి చాలు. మంచి బోధన ఇస్తే మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్లు పెరుగుతారు. స్కూల్ ట్యూషన్, హాబీ క్లాసులు లేదా పోటీ పరీక్షల కోచింగ్‌కు ఇది చాలా వర్కవుట్ అవుతుంది.
Related News
4. కస్టమైజ్డ్ గిఫ్ట్ వ్యాపారం
పుట్టినరోజులు, వివాహాలు, ఎనివర్సరీల కోసం వ్యక్తిగత గిఫ్ట్స్ డిమాండ్ బాగా ఉంటుంది. మగ్స్, టీషర్ట్స్, ఫోటో ఫ్రేమ్‌లపై డిజైన్‌లతో కస్టమైజ్డ్ గిఫ్ట్‌లు తయారు చేసి అమ్మవచ్చు. రూ.1 లక్ష కన్నా తక్కువ పెట్టుబడిలో ప్రింటర్, డిజైన్ సాఫ్ట్‌వేర్, గిఫ్ట్ ఐటమ్స్ కొనుగోలు చేయొచ్చు. Instagram, WhatsApp ద్వారా ప్రోమోషన్ చేస్తే ఆర్డర్లు వస్తాయి, ఆదాయం త్వరగా వస్తుంది.
5. ఫ్రీలాన్సింగ్ సేవలు
మీకు కాస్త రాయడం, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందంటే – ఇది మీ కోసం. కేవలం ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, మరియు ఓ మంచి పోర్ట్‌ఫోలియో ఉంటే చాలు. రూ.50,000 లోపు పెట్టుబడి ఉంటుంది. Fiverr, Upwork, LinkedIn వంటివి ద్వారా క్లయింట్స్ సంపాదించి, చిన్న ప్రాజెక్ట్స్‌తో మొదలుపెట్టి మెల్లగా స్కేల్ చేయవచ్చు.
ఇప్పుడే ప్రారంభించండి… చిన్న పెట్టుబడితో పెద్ద కలలు నిజం చేసుకోండి… ఇవి 2025 లో ట్రెండ్‌లో ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ ఐడియాలు.