రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ ప్రెస్టీజియస్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్ నారాయణ. నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక జరిగింది. తన సినిమా ఓపెనింగ్స్‌కు హాజరు కాకపోవడంపై మహేష్ సెంటిమెంట్‌గా ఉన్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆ సెంటిమెంట్ ని పక్కన పెట్టి ఓపెనింగ్ లోనే బజ్ క్రియేట్ చేసాడు. రాజమౌళి, మహేష్ బాబు కుటుంబాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మహేష్‌బాబు కెరీర్‌లో ఇది 29వ సినిమా కాబట్టి ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అని పిలుస్తున్నారు.
వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా, ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తారని అంటున్నారు. అమేజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఇది అని విజయేంద్రప్రసాద్ గతంలోనే చెప్పారు. లొకేషన్ల కోసం రాజమౌళి ఒడిశా, ఆఫ్రికా అడవులతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లాడు. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త లుక్‌లో కనిపించనున్న మహేష్ బాబు ఇందుకోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.