ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. వారి ఆర్థిక స్వాతంత్య్రం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు మహిళలకు ఆర్థికంగా బలాన్ని, స్వయం ఉపాధిని, భద్రతను అందించేందుకు రూపొందించబడ్డాయి.
లఖ్‌పతి దీదీ పథకం
ఈ పథకం ద్వారా స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించబడతాయి. ఇది వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
డ్రోన్ దీదీ పథకం
వ్యవసాయ రంగంలో మహిళలకు డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడం ద్వారా, పంట పర్యవేక్షణ, ఎరువుల పిచికారీ వంటి పనుల్లో నైపుణ్యాన్ని పెంచుతుంది.
Related News
మిషన్ ఇంద్రధనుష్
గర్భిణీలు మరియు పిల్లలకు అవసరమైన టీకాలను అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం.
ముద్రా యోజన
సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలు చేసే మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు అందించడం ద్వారా వారి వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది.
ట్రెడ్ స్కీమ్
మహిళా వ్యాపారవేత్తలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఉజ్వల యోజన
పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
స్టాండప్ ఇండియా మిషన్
ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు పెద్ద మొత్తంలో రుణాలను అందించడం ద్వారా వారి వ్యాపారాలను స్థాపించడంలో సహాయపడుతుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు మహిళల పేరిట ఇళ్లు కేటాయించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.
స్టెప్ ఇనిషియేటివ్
మహిళలకు నైపుణ్య శిక్షణను అందించడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
మహిళా ఈ-హాత్ స్కీమ్
మహిళా వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందించడం ద్వారా వారి వ్యాపారాలను విస్తరించడంలో సహాయపడుతుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)
మహిళల ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఈ పథకం ద్వారా పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటుతో డిపాజిట్ చేయవచ్చు. 2025 మార్చి 31 వరకు ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది.
సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఈ సేవింగ్స్ స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
మహిళా శక్తి కేంద్రాలు
మహిళలు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, ఉపాధిని పొందడంలో సాయపడతాయి. ఆర్థిక సాధికారతను అందించడంలో ఉపయోగపడతాయి.
ఈ పథకాలు మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, ఉపాధి అవకాశాలు, భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీరు కూడా ఈ పథకాల గురించి తెలుసుకొని, వాటిని వినియోగించుకోండి. ఇది మీ భవిష్యత్తును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.