మార్కెట్‌లో మరో గండం. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు తీవ్ర పతనంలోకి. ఇన్వెస్టర్లకు ప్రరోజు కళ్లెదుటే సంపద కరిగిపోతున్న అనుభూతి. మార్కెట్‌లో అన్ని రంగాల్లోనూ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లలో మూడేళ్లలో కనీవినీ ఎరుగని పతనం కనిపిస్తోంది.
- BSE స్మాల్‌క్యాప్ ఇండెక్స్ – ఇండెక్స్ ఒకేరోజులో 2% క్షీణత
- మొత్తం 2025లో ఇప్పటివరకు 20% పడిపోవడం ఆందోళనకరం
- BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ – ఇంతవరకు 17% నష్టాల్లో
- గత 1 నెలలో స్మాల్‌క్యాప్ 14%, మిడ్‌క్యాప్ 11% నష్టపోయాయి
అసలు సమస్య ఏమిటి?
1.విలువల భయం (Valuation Concern)
- మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఇప్పటికే చాలా ఎక్కువ రేటుకు ట్రేడ్ అవుతున్నాయి.
- MSCI ఇండియా విలువలు 21x వద్ద ఉన్నప్పటికీ, 2015-2022 సగటు 19x కన్నా ఎక్కువ.
- డాలర్ బలపడడం – దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటున్నారు.
2. లాభదాయకత తగ్గడం (Earnings Downgrade)
- పెద్ద కంపెనీల్లో లాభాల్లో తక్కువ కోత ఉండగా, మిడ్‌క్యాప్ లాభాలు 3% తగ్గాయి, స్మాల్‌క్యాప్ లాభాలు 6% పడిపోయాయి.
- ఇది సూచిస్తోంది ఈ స్టాక్స్‌లో నష్టాలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు.
3. మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్ భయం
- స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్ భారీగా క్యాష్ పట్టుకుని ఉన్నాయి.
- మార్కెట్ మరింత క్షీణిస్తే, ఈ ఫండ్స్ కూడా అమ్మకాలకు దిగే ప్రమాదం ఉంది.
- ఇది మొత్తం మార్కెట్‌ను మరింత దిగజార్చే అవకాశముంది.
ఇక మార్కెట్‌లో భవిష్యత్తు ఏమిటి?
ఇక్కడి నుంచి మరింత పతనమా? లేక స్టెబిలిటీ వస్తుందా? మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్లు పెరిగితే, మార్కెట్‌లో కొత్త బాటమ్ వచ్చే ఛాన్స్. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు సరైన సమయమా? లేక ఇంకా వేచి చూడాలా?
ఇలాంటి సమయంలో పెట్టుబడి పెట్టేముందు బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి తొందరపడి మీ పెట్టుబడిని నష్టాలుగా మార్చుకోకండి. అదేవిధంగా ఇలాంటి అవకాశాలు తిరిగి రావు. ఇప్పుడు మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో తక్కువ ధరలకు లభ్యమవుతున్న పేర్లను కొనడం వల్ల ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంటుంది.