బ్రేకింగ్ న్యూస్: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల, US అధ్యక్షుడు జో బిడెన్ రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడి చేయడానికి ATACMS క్షిపణులను ఉపయోగించేందుకు అధికారం ఇచ్చారు.
తాజాగా ఉక్రెయిన్ అన్నంత పని చేసేసింది. రష్యాలోని పలు ప్రాంతాలపై దాడి చేసేందుకు ATACMS క్షిపణులను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో ఉక్రెయిన్ మరింత సంక్షోభంలో కూరుకుపోనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం అణ్వాయుధాల విస్తృత వినియోగాన్ని అనుమతించే డిక్రీపై సంతకం చేశారు. అణ్వాయుధాలు దాడికి గురైతే వాటిని ఉపయోగించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. అయితే తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడిపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతాయా? అనే సందేహం ఉంది.