వివాదాస్పద స్వామి నిత్యానంద గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో ఆయనకు నటి రంజితతో ఎఫైర్ ఉండేది… మీడియా లో వీరి ప్రైవేట్ వీడియో కూడా ఉంది.. నిత్యానంద స్వామి అప్పటి నుంచి ఆయన ఏదో ఒక విషయం వల్ల వివాదాస్పదంగా మారుతున్నాడు. అయితే, అలాంటి వివాదాస్పద నిత్యానంద స్వామి మరణించాడని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన రెండు రోజుల క్రితమే మరణించారని కూడా చెబుతున్నారు.
హిందూ మతాన్ని కాపాడటానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశాడని తమిళ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ఇలా చెప్పినట్లుగా ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది.
అయితే, ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ… ఆయన మరణించారని జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదంతా తప్పుడు ప్రచారం అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు… ఏప్రిల్ మొదటి రోజు కాబట్టి, అందరినీ ఫూల్స్ చేయడానికి ఈ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా… నిత్యానంద స్వామికి అహ్మదాబాద్ మరియు దేశంలోని దాదాపు 40 ప్రాంతాలలో ఆశ్రమాలు ఉన్నాయి. ఆ సమయంలో, నిత్యానంద (స్వామి నిత్యానంద) లైంగిక కుంభకోణం కేసులో చిక్కుకున్న తర్వాత భారతదేశం నుండి పారిపోయాడు. ఆ తర్వాత, ఆయన హిందువుల కోసం కైలాసం అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించాడని కూడా ప్రచారం జరుగుతోంది.