ఏప్రిల్ 2న జరిగిన “అమెరికా లిబరేషన్ డే” ప్రసంగంలో, డొనాల్డ్ ట్రంప్ తానే స్వయంగా రిసిప్రోకల్ టారిఫ్‌ల గురించి వివరించారు. “ఇది ఇకపై జరగదు!” అని గట్టిగా ప్రకటించిన ఆయన, “కొన్ని సార్లు మన స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ హాని చేస్తారు” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రకారం, ఇతర దేశాలు అమెరికాపై పన్నులు విధిస్తే, అదే విధంగా అమెరికా కూడా వారిపై పన్నులు విధిస్తుంది.
ఈ విధానంతో అమెరికా అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత కఠినమైన నియంత్రణలు అమలు చేయనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని 20కు పైగా దేశాలతో (భారతదేశం సహా) అమెరికాకు వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే, ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
గత కొన్ని వారాలుగా, అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న కఠినమైన వాణిజ్య చర్యలు పెట్టుబడిదారుల్లో భయాన్ని కలిగించాయి. అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా ప్రతిస్పందన చర్యలు చేపడతారనే ఆందోళన మదుపరులను వెనుకంజ వేయించింది.
Related News
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వడం మొదలైంది. అమెరికా టారిఫ్ చర్యలు కొనసాగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
అయితే ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వలన భారతదేశానికి కూడా చాలా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మన దేశం కూడా వాణిజ్య సంబంధాలకు అమెరికాపై ఆధారపడి ఉండడం వల్ల ఈ నిర్ణయాల ద్వారా మనకు ప్రభావం జరగవచ్చు.