METRO CHARGES HIKE: హైదరాబాద్ వాసులకు షాక్..మెట్రో ఛార్జీల పెంపు..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులను షాక్ కు గురిచేసింది. ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కు పెంచారు. అంతేకాకుండా, గరిష్ట ఛార్జీని రూ.60 నుంచి రూ.75కు పెంచారు. నాలుగు కిలోమీటర్ల నుండి 6 కిలోమీటర్లకు రూ.30, 6 కిలోమీటర్ల నుండి తొమ్మిది కిలోమీటర్లకు రూ.40, 9 కిలోమీటర్ల నుండి 12 కిలోమీటర్లకు రూ.50, 12 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్లకు రూ.55, 18 కిలోమీటర్ల నుండి 21 కిలోమీటర్లకు రూ.66, 21 కిలోమీటర్ల నుండి 24 కిలోమీటర్లకు రూ.70, 24 కిలోమీటర్ల నుండి ఆపై కిలోమీటరుకు రూ.75.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పెరిగిన ఛార్జీలు రేపటి నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ఇటీవల ఛార్జీలు పెంచుతామని ప్రకటించినప్పుడు చెప్పినట్లుగా, తాజాగా పెరిగిన ధరలను ప్రకటించింది. ఇదిలా ఉండగా..ప్రతిరోజూ వేలాది మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా, ఆఫీసులకు వెళ్లే చాలా మంది సైకిళ్లు, బస్సుల్లో ప్రయాణించకుండా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల మెట్రోలో రద్దీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎల్ అండ్ టీ మెట్రో సమయాలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే, మెట్రో మొదటి నుంచి నష్టాల్లో ఉందని చెబుతూ వచ్చిన ఆ సంస్థ, ఛార్జీలను పెంచి ప్రయాణికులను షాక్ కు గురిచేసింది.