Viral Video: మార్క్‌లిస్ట్‌ కోసం స్కూలుకు వెళ్లిన విద్యార్థి పై లైంగికదాడి

10వ తరగతి మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వచ్చిన బాలికపై తోటి విద్యార్థి లైంగిక దాడి చేశాడు. బలవంతంగా తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను మరో నలుగురు యువకులు వీడియో తీసి బెదిరించారు. ప్రస్తుతం అందరూ జైలులో కటకటాలు లెక్కిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 10వ తరగతి మార్కుల జాబితా కొరకు పాఠశాలకు వచ్చింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వస్తుండగా అప్పటికే అక్కడే ఉన్న తోటి విద్యార్థి ఆమెని తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనను మరో నలుగురు యువకులు వీడియో తీశారు. ఆ తర్వాత ఆ దృశ్యాలను చూపించి బాలికపై లైగింక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాదు వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 2 లక్షలు ఇస్తామని చెప్పినా సరిపోదని, ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అక్కడితో ఆగకుండా ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బాలుడి పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. వీడియో తీసిన నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.