రాష్ట్రము లో త్వరలో జరగబోవు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం గా పోలింగ్ రోజున అనగా 27 వతారీకు న ఆయా జిల్లాలలో సెలవు ప్రకటించారు. అలాగే ఎలక్షన్ ముందు రోజు స్థానిక సెలవు ప్రకటించే అవకాశం ఉంది
రాష్ట్రంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు, అవసరమైతే ఓట్ల లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం ఈమేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈనెల 27న రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 27న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది.