SBI Jobs: SBI లో ఏకంగా 85 వేల పోస్టులు భర్తీ ఎక్కువగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం!

Mumbai May 12: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBIఐ) తీపి కబురు అందించింది. IT Sector లో రిక్రూట్‌మెంట్ మందగించిన తరుణంలో, ఎస్‌బీఐ జాబ్స్ ఫ్రెషర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు ప్రత్యామ్నాయాన్ని అందించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో 12 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు తెలిపింది. వీరిలో 85 శాతం మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌లకు అవకాశం కల్పిస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖర్రా తెలిపారు. 3,000 మంది ప్రాజెక్ట్ అధికారులు మరియు 8,000 మంది అసోసియేట్‌లకు బ్యాంకింగ్ వ్యవహారాలలో శిక్షణ ఇవ్వబడుతుంది మరియు వివిధ వ్యాపార విభాగాలలో నియమిస్తారు.

గతంతో పోలిస్తే బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడి ఉందని దినేష్ ఖర్రా అన్నారు. సాంకేతికత ఆధారంగా ఖాతాదారులకు కొత్త మార్గంలో ఎలా సేవలందించాలనే దానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో కొన్ని బ్యాంకులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు. శిక్షణ పొందిన వారి అర్హతలు, ప్రతిభ ఆధారంగా వారికి వివిధ వ్యాపార, ఐటీ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. అప్పుడే బ్యాంకింగ్ రంగానికి తగిన రీతిలో టెక్ మ్యాన్ పవర్ అందించగలమని అన్నారు.

Related News

SBI సిబ్బందికి తమ ఇన్‌స్టిట్యూట్‌లో సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు భారీ మొత్తం వెచ్చిస్తున్నట్లు దినేష్ ఖర్రా తెలిపారు. ప్రతి ఉద్యోగి సాంకేతికతను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు సాంకేతికత ఆధారంగానే ఎక్కువగా జరుగుతాయన్న వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ‘ఆర్‌బీఐ’ కూడా తగిన మార్గదర్శకాలను జారీ చేసిందని ఆయన చెప్పారు.