SBI JOBS : నెలకి రూ. 63,000 జీతం తో SBI లో 5280 ఆఫీసర్ ఉద్యోగాలు .. ఇర్హతలు ఇవే..

SBI జాబ్ రిక్రూట్‌మెంట్ ముంబయి: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ లో ఇప్పటికే 8 వేలకు పైగా క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఎస్‌బీఐ తాజాగా మరో 5 వేలకు పైగా ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. SBI దేశవ్యాప్తంగా సర్కిళ్లలో 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు బుధవారం (నవంబర్ 22) నుండి డిసెంబర్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

నోటిఫికేషన్‌లోని 10 ముఖ్యమైన అంశాలు..

మొత్తం 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 825 ఖాళీలు ఉన్నాయి.

Eligibility: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో Degree లేదా తత్సమాన అర్హత తప్పనిసరి.

Age limit: అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు (31 అక్టోబర్ 2023 నాటికి).

రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.

ఏదైనా కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో రెండేళ్ల పని అనుభవం.

Pay Scale : నెలకి రూ. 36,000 – రూ. 63,840 చెల్లిస్తారు.

Application Fee: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.750; SC/ST/PWDలకు ఫీజు లేదు.

ఏ సర్కిల్‌లో దరఖాస్తు చేస్తున్నారో.. ఆ ప్రాంత భాషను చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంలో నైపుణ్యం ఉండాలి.
SBI Officer posts Selection Process: ఎంపిక ఆన్‌లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో 120 మార్కులకు మరియు Descriptive రూపంలో 50 మార్కులకు ఉంటుంది. Objective పరీక్షకు 2 గంటల సమయం కాగా, డిస్క్రిప్టివ్ పరీక్షను 30 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ పరీక్షను ఇంగ్లీషులో మాత్రమే రాయాలి. తప్పు సమాధానానికి ప్రతికూల మార్కులు లేవు.

ఆన్‌లైన్ పరీక్ష జనవరి 2024లో నిర్వహించబడే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీలు తర్వాత ప్రకటించబడతాయి. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *