సంక్రాంతి సందడి మొదలైంది.. సెలవులపై క్లారిటీ రావడంతో ఇప్పటికే పల్లెబాట పట్టారు.. ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది.
రెండు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. తాజాగా.. ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది.. వరుసగా ఆరు రోజుల పాటు జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సెలవులు ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించగా.. ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించాయి.
ఏపీలో జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ప్రకటించింది. 20వ తేదీ సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో జనవరి 11 నుంచి 17 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 17 శుక్రవారంతో సెలవులు ముగియనుండగా.. శనివారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.