రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు.
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఐదుగురు పిల్లలు ఉన్నా ప్రతి బిడ్డకు తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని ఆయన అన్నారు. జనాభా పెంచాలని ప్రస్తుతం తానే చెబుతున్నానని, ప్రతి బిడ్డకు మహిళా ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులు ఇస్తామని ఆయన అన్నారు.
గర్భిణీ స్త్రీల మరణాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 43వ స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వాటిని నియంత్రించాలని, సాధారణ ప్రసవాలను పెంచాలని, మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలని చంద్రబాబు అన్నారు.