ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IITK) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు జనవరి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు – ఖాళీలు
1. Senior Superintendent Engineer (SSE): 01
2. Superintendent Engineer (DCE & DEE): 02
3. Deputy Registrar: 02
4. Executive Engineer (DCE & DEE): 02
5. Assistant Counselor: 03
6. Assistant Registrar: 01
7. Assistant Registrar (Library): 01
8. Hall Management Officer: 01
9. Medical Officer: 02
10. Assistant Security Officer (For Women): 02
11. Assistant Sports Officer: 02
12. Junior Technical Superintendent (Computer Science & Engineering, Dean of Academic Affairs): 03
13. Junior Assistant: 12
మొత్తం ఖాళీల సంఖ్య: 34
అర్హత: డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్), ఎంఫిల్ (క్లినికల్ సైకాలజీ), హోటల్ మేనేజ్మెంట్, MBBS, డిగ్రీ (BPED), PG (MCA, MSc) పోస్టు మరియు పని అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో.
వయోపరిమితి:
- సీనియర్ సూపరింటెండెంట్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టులకు 57 సంవత్సరాలు;
- డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు 21 – 50 సంవత్సరాలు;
- అసిస్టెంట్ కౌన్సెలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లైబ్రరీ), హాల్ మేనేజ్మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 21 – 45 సంవత్సరాలు;
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (మహిళల కోసం), అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు 21 – 35 సంవత్సరాలు .
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 – 30 సంవత్సరాలు.
జీతం:
- సీనియర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రూ. 1,31,100 – రూ. 2,16,600 నెలకు;
- సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టు రూ. 1,23,100 – రూ. 2,15,900;
- డిప్యూటీ రిజిస్ట్రార్ రూ. 78,800 – రూ. 2,09,200;
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు రూ. 67,700 – రూ. 2,08,700;
- అసిస్టెంట్ కౌన్సెలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లైబ్రరీ), హాల్ మేనేజ్మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100 – రూ.1,77,500;
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (మహిళల కోసం), అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.35,400 – రూ.1,12,400;
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,700 – రూ.69,100.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2025.