ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు.
సజ్జాతో పాటు మరో 20 మందికి పైగా సలహాదారులు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను CS జవహర్ రెడ్డికి పంపించారు.
TTD చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆశ్చర్యం ఏంటంటే… ఎన్నికల ఫలితాలకు ముందు పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సమాచార పౌర సంబంధాల (I & PR) కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత మాట మార్చారు. ఈ పదవి నుంచి తనను తాను రిలీవ్ చేసేందుకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు