జూన్ 1 నుండి, అనేక ముఖ్యమైన విషయాలలో మార్పులు ఉంటాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు తదితర అంశాల్లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. అవేంటో చూద్దాం.
ఆధార్ కార్డ్ అప్‌డేట్
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ప్రజలకు సూచించింది. ఇది ఉచితంగా నవీకరించడానికి అవకాశాన్ని అందిస్తుంది. కానీ ఈ గడువు జూన్ 14తో ముగుస్తుంది. ఈ గడువు తేదీ తర్వాత ప్రతి అప్‌డేట్‌కు ఛార్జీ విధించబడుతుంది. మీరు సకాలంలో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే ఛార్జీల భారం నుండి తప్పించుకోవచ్చు
వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత: డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్స్ సులువుగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTO కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కు అర్హత పొందండి. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ కేంద్రాలకు వెళ్లకుండా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల నుంచి సర్టిఫికెట్ పొంది ఆర్టీఓల ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త నిబంధన తీసుకొచ్చారు.
ట్రాఫిక్ నియమాలు
మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.25 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది. మైనర్‌కు 18 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్‌పై ఆంక్షలు విధిస్తారు.అతి వేగంతో వాహనం నడిపితే రూ.1000 నుంచి 2000 వరకు జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా విధిస్తారు.
గ్యాస్ ధరలు
ప్రతి నెలా 1వ తేదీన నిత్యావసర గ్యాస్ ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అయితే ఈసారి సిలిండర్ ధరలు తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు. లేదంటే స్థిరంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో రేపు ఉదయం తేలిపోనుంది. అందువల్ల సిలిండర్ ధరలు మారవచ్చు. ఇది పెరిగితే ప్రతికూల ప్రభావం ఉంటుంది.