అక్షయ తృతీయ (Akshaya Trutiya 2025) సందర్భంగా, బంగారం కొనుగోలుదారులకే కాదు.. కొత్త వాహన కొనుగోలుదారులకు కూడా అధిక డిమాండ్ ఉంటుంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశీయ వాహన తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్లను అందించడం ప్రారంభించింది.
అక్షయ తృతీయను జరుపుకోవడానికి ఓలా ఎలక్ట్రిక్ 72-గంటల ఎలక్ట్రిక్ రష్ అనే పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. ఇది ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో, ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ప్రత్యేక తగ్గింపులు, ఉచిత పొడిగించిన వారంటీలు.. అదే రోజు స్కూటర్ డెలివరీలు ఉంటాయి.
ఓలా ఎలక్ట్రిక్ ఇస్తున్న ఆఫర్ సమయంలో.. మీరు Gen 2 మరియు Gen 3 మోడళ్లతో సహా S1 పోర్ట్‌ఫోలియో అంతటా రూ. 40,000 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుల తర్వాత, Gen 2 స్కూటర్ల ధరలు రూ. 67,499 నుండి ప్రారంభమవుతాయి.. Gen 3 లైనప్ ధర రూ. 73,999 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
ఓలా తన #హైపర్‌డ్రైవ్ సర్వీస్ కింద ఒకే రోజు డెలివరీ మరియు రిజిస్ట్రేషన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు స్కూటర్లను ఆన్లైన్లో లేదా డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయవచ్చు.
అక్షయ తృతీయ ఆఫర్లను అందించే ఇతర కంపెనీలు
ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో మరియు హోండా మోటార్‌సైకిల్ మాత్రమే కాకుండా అక్షయ తృతీయ సందర్భంగా ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే, ప్రతి కంపెనీ అందించే ఖచ్చితమైన ఆఫర్‌ను తెలుసుకోవడానికి, మీరు మీ సమీప బ్రాండ్ డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.