మీ రిటైర్మెంట్ ప్లాన్, కొత్త ఇల్లు కొనుగోలు, పిల్లల చదువు ఖర్చులు లాంటి భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడానికి SIP (Systematic Investment Plan) ఒక ఉత్తమమైన పెట్టుబడి మార్గం. అయితే, చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సందేహం – తక్కువ కాలం ఎక్కువ పెట్టుబడి చేయాలా? లేక ఎక్కువ కాలం తక్కువ పెట్టుబడి చేయాలా?
ఇప్పుడే మనం లెక్కలు చూసి ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో తెలుసుకుందాం
రూ. 30,000 SIP – 5 ఏళ్లలో ఎంత Returns వస్తాయి?
మీరు రూ. 30,000 నెలనెలా 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, వేర్వేరు రాబడి శాతాల (Return Rates)పై మీ పెట్టుబడి ఎలా పెరుగుతుందో చూడండి.
Related News
- 12% రాబడితో: రూ. 24.3 లక్షలు
- 13% రాబడితో: రూ. 24.9 లక్షలు
- 14% రాబడితో: రూ. 25.5 లక్షలు
- మొత్తం పెట్టుబడి: రూ. 18 లక్షలు
- లాభం: రూ. 6.3 లక్షలు – రూ. 7.5 లక్షల మధ్య
రూ. 5,000 SIP – 30 ఏళ్లలో ఎంత Returns వస్తాయి?
మీరు రూ. 5,000 SIP 30 ఏళ్ల పాటు చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం
- 12% రాబడితో: రూ. 1.54 కోట్లు
- 13% రాబడితో: రూ. 1.88 కోట్లు
- 14% రాబడితో: రూ. 2.29 కోట్లు
- మొత్తం పెట్టుబడి: రూ. 18 లక్షలు
- లాభం: రూ. 1.36 కోట్లు – రూ. 2.11 కోట్లు మధ్య
ఏది ఎక్కువ లాభం తెస్తుంది?
మీరు రూ. 18 లక్షలు పెట్టుబడి పెట్టినా, 5 ఏళ్లలో పెట్టిన 30,000 SIP కంటే, 30 ఏళ్లలో పెట్టిన 5,000 SIP Returns 6-10 రెట్లు ఎక్కువ వస్తుంది
ఎందుకంటే? – కాంపౌండింగ్ మ్యాజిక్
- పెద్ద మొత్తం పెట్టుబడి తక్కువ కాలంలో పెరగడం కష్టం
- చిన్న మొత్తం ఎక్కువ కాలం పెడితే, కాంపౌండింగ్ వల్ల భారీగా పెరుగుతుంది.
- టైమ్ ఎక్కువ ఉన్నప్పుడే పెట్టుబడి విలువ బాగా పెరుగుతుంది.
ముఖ్యమైన విషయం– ఆలస్యం చేయకండి
- మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలు పెడతారో, అంత ఎక్కువ Returns వస్తాయి.
- అలస్యం చెయ్యడం అంటే – కోట్లు కోల్పోవడం
- చిన్న మొత్తంతోనే పెద్ద సంపద సాధించొచ్చు – దీన్ని అర్థం చేసుకుని వెంటనే మొదలు పెట్టండి
మీరు ఇంకా SIP మొదలు పెట్టలేదా? నేడు స్టార్ట్ చేయండి… భవిష్యత్తులో మీరు మీకే థ్యాంక్స్ చెప్పుకుంటారు.