రాజీవ్ గాంధీ విజ్ఞానిక్ సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) యొక్క నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం మరియు ఇడుపులపాయ క్యాంపస్లలో 6-సంవత్సరాల సమీకృత బీటెక్ కోర్సులో 2025-26 సంవత్సరానికి ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. ప్రవేశ వివరాలను RGUKT రిజిస్ట్రార్, నూజివీడు క్యాంపస్ డైరెక్టర్ మరియు ప్రవేశ కన్వీనర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ ప్రకటించారు. ఈ సంవత్సరం అర్జీల స్వీకరణ ప్రక్రియ 2 నెలల ముందే ప్రారంభం అయింది. దరఖాస్తులు RGUKT అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు.
Related News
ముఖ్య తేదీలు
online application will start from 27th April 2025 10AM
- అర్జీ సమర్పణ తుది తేదీ: మే 20, 2025 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- ఎంపికైన అభ్యర్థుల జాబితా: జూన్ 5, 2025
- సర్టిఫికేట్ ధృవీకరణ & కౌన్సెలింగ్: జూన్ 11 నుండి
- తరగతుల ప్రారంభం: జూన్ 30, 2025
సీట్ల వివరాలు
- ప్రతి క్యాంపస్లో1,000 సీట్లు + 100 EWS సీట్లు కేటాయించబడ్డాయి.
- మొత్తం4 క్యాంపస్లలో 4,400 సీట్లు ఉంటాయి.
- తెలుగేతర రాష్ట్రాల వారికి25% సూపర్ న్యూమరరీ సీట్లు (ట్యూషన్ ఫీజు: సంవత్సరానికి ₹1.5 లక్షలు).
ఫీజు వివరాలు
- PUC (ప్రీ–యూనివర్సిటీ కోర్సు): సంవత్సరానికి ₹45,000
- ఇంజినీరింగ్: సంవత్సరానికి ₹50,000
ప్రత్యేక మార్గదర్శకాలు
- క్యాంపస్ కేటాయింపు: మెరిట్ మరియు ప్రాధాన్యత ఆధారంగా నిర్ణయిస్తారు. ఒకసారి కేటాయించిన తర్వాత బదిలీ లేదు.
- రిజర్వేషన్:
- ఆంధ్ర విశ్వవిద్యాలయం (17 జిల్లాలు) : 65.62% సీట్లు
- శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (9 జిల్లాలు) : 34.38% సీట్లు
- PUC తర్వాత ఎగ్జిట్ ఎంపిక: ట్రిపుల్ ఐటీ నుండి బయటకు వెళ్లి ఇతర సంస్థలలో చదువుకునే అవకాశం ఉంది.
ప్రత్యేక షెడ్యూల్ (PHC, CAP, NCC, స్పోర్ట్స్, స్కౌట్స్)
- సర్టిఫికేట్ ధృవీకరణ: నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహించబడుతుంది.
ముఖ్యమైన గమనికలు
- ఇతర కాలేజీలలో చేరిన తర్వాత RGUKT సీటు వచ్చినాట్రాన్స్ఫర్ అనుమతి లేదు.
- SC సబ్–ప్లాన్ప్రకారం సీట్లు కేటాయించబడతాయి.
🔗 అధికారిక వెబ్సైట్ : RGUK
Downlaod Detailed Notification