ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (RGUKT) 2024-25 విద్యా సంవత్సరానికి గాను APలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్జీయూ కేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 8 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 25. 10 వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్ నుండి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు సంబంధిత తేదీలలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. సీట్లు పొందిన విద్యార్థులు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతోపాటు మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశం పొందుతారు.
సీట్ల కేటాయింపు ఈ విధం గా ..
మొత్తం నాలుగు క్యాంపస్‌ల్లో.. ఒక్కో క్యాంపస్‌కు వెయ్యి సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 25 శాతం సూపర్‌న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించబడతాయి. క్యాంపస్‌లు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కేటగిరీల వారీగా ప్రాధాన్యత క్రమంలో కేటాయించబడతాయి. ఒకసారి క్యాంపస్‌ను కేటాయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేసే అవకాశం లేదు.
ఫీజు వివరాలు..
పీయూసీ కోర్సుకు ఏడాదికి రూ.45 వేలు ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి. బీటెక్ ప్రోగ్రామ్ కోసం ఏడాదికి రూ.50 వేలు చెల్లించాలి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఏడాదికి రూ.1.50 లక్షలు ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి.
S.No. |
Description |
Date |
1 | Notification Date | 06-05-2024 |
2 | Online applications | 08-05-2024 |
3 | Last date for receiving online applications | July 2024 |
4 | Special Categories Certificate Verification | |
CAP | 01-7-2024 to 03-7-2024 | |
Sports | 03-7-2024 to 06-7-2024 | |
PH | 03-7-2024 | |
Bharat Scouts and Guides | 02-7-2024 to 03-7-2024 | |
NCC | 03-7-2024 to 05-7-2024 | |
5 | Announcement of Provisional Selection List | 11-7-2024 (Tentative) |
6 | Certificate Verification for RGUKT, Nuzvid Campus | 22-7-2024 and 23-7-2024 |
7 | Certificate Verification for RGUKT, R.K Valley Campus | 22-7-2024 and 23-7-2024 |
8 | Certificate Verification for RGUKT, Ongole Campus | 24-7-2024 and 25-7-2024 |
9 | Certificate Verification for RGUKT, Srikakulam Campus | 26-7-2024 and 27-7-2024 |
10 | Reporting to the respective campuses | will be intimated separately |
Imp Dates:
- 1 Starting date for receiving online registrations: 08-05-2024
- 2 Last date for receiving online registrations: 25-06-2024 up to 05.00 P.M
- 3 Date of declaration of provisional selected candidates list: 11-07-2024 (Tentative)