Redmi Note 14 Pro: దుమ్ములేపుతుంది.. రెడ్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కెమెరా క్వాలిటీ వేరే లెవల్..!

Redmi Note 14 pro: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారు ఉండరు. అన్నం తినక పోయిన ఉంటారు గాని మీ స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు ఒక్క క్షణం కూడా గడపలేరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ఒక అవసరంగా మారింది. నిద్రలేవగానే ఇంట్లో కూరగాయలు కొనడం దగ్గర్నుంచి పడుకునేటప్పుడు ఏసీ ఆన్ చేయడం వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్‌తోనే హుషారుగా జరుగుతున్నాయి. అందుకే దేశీయ మార్కెట్‌లో టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వరుసగా ఫోన్లు లాంచ్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సబ్-బ్రాండ్ రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. Redmi Note 14, Note 14 Pro మరియు Note 14 Pro Plus 14 లైనప్‌లో వస్తున్నాయి. రెడ్‌మి నోట్ 13 సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, నోట్ 14 లాంచ్ సంచలనం సృష్టించింది. ఇటీవల, ఒక టెక్ హీరో రెడ్‌మీ నోట్ 14 ప్రో స్పెసిఫికేషన్‌లను లీక్ చేశాడు. అయితే ఇవి అధికారికంగా ధృవీకరించబడలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 14 Pro Specifications

  • Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్, 445 PPI పిక్సెల్‌తో ఉంటుంది.
  • స్మార్ట్‌ఫోన్ 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా రక్షించబడింది.
  • స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో పాటు 16GB RAM + 512 UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
  • ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5,500 mAh బ్యాటరీతో రావచ్చు.
  • ఫోన్ hyper OS  అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా Android 14 ని కలిగి ఉంది .
  • Redmi Note 14 Pro ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు.
  • ఇది OIS మద్దతుతో 50 MP ప్రధాన సెన్సార్ మరియు 12 MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది.
  • ఇది 4K వీడియో రికార్డింగ్‌తో 2 MP మాక్రో సెన్సార్‌ను కూడా పొందవచ్చు.
  • సెల్ఫీల కోసం, స్మార్ట్‌ఫోన్ 1080p రికార్డింగ్ చేయగల 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రాబోతుంది అని సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *