ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో, టీమ్ ఇండియా ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టి దిగ్గజాల జాబితాలో చేరాడు.
అవును… టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొత్త రికార్డు సృష్టించాడు. ఇందులో భాగంగా… అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు తీసిన తొలి భారత ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా నిలిచాడు. అదే సమయంలో… భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన జేమ్స్ ఆండర్సన్ 40 వికెట్ల రికార్డును అధిగమించాడు.
ఈ జాబితాలో, టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 953 వికెట్లతో భారత్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.. ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ 765 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. హర్భజన్ సింగ్ 707 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
వారి తర్వాత, టీం ఇండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 687 వికెట్లతో నాల్గవ స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత, రవీంద్ర జడేజా 600 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు, వాటిలో 323 టెస్ట్ వికెట్లు, 54 టీ20 వికెట్లు, 223 వన్డే వికెట్లు ఉన్నాయి.
ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను పరిశీలిస్తే… రవీంద్ర జడేజా – 42 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.. జేమ్స్ ఆండర్సన్ – 40, ఆండ్రూ ఫ్లింటాఫ్ – 37, హర్భజన్ సింగ్ – 36, జవగల్ శ్రీనాథ్ & రవిచంద్రన్ అశ్విన్ – 35 వికెట్లతో వరుసగా స్థానాల్లో ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీం ఇండియా బౌలర్లు!:
అనిల్ కుంబ్లే – 953 వికెట్లు (401 మ్యాచ్‌లు)
రవిచంద్రన్ అశ్విన్ – 765 వికెట్లు (287 మ్యాచ్‌లు)
హర్భజన్ సింగ్ – 707 వికెట్లు (365 మ్యాచ్‌లు)
కపిల్ దేవ్ – 687 వికెట్లు (365 మ్యాచ్‌లు)
రవీంద్ర జడేజా – 600 వికెట్లు (325* మ్యాచ్‌లు)