Heavy Rain Alert: ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 29 నాటికి అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతుండటం వల్ల సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
సోమవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ అల్పపీడనం కారణంగా నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Related News
అంతేకాకుండా, ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 29 నాటికి అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతుంది. మే 26, 27, 28, 29 తేదీల్లో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.