WEATHER: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన..

రెండు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. రాయలసీమ నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని కారణంగా ఉత్తర ఆంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలు, తెలంగాణలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నాయని, చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల వాతావరణం చల్లబడే సూచనలు లేవని, గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజులు కోస్తా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో 1 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

Related News

తెలంగాణకు వర్ష సూచన..

తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. రాబోయే మూడు రోజులు ఉదయం కొన్ని చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎటువంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత వాతావరణం మళ్లీ పొడిగా ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు.. ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చాలా చోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. వేసవి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.