Rain Alert: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..

హైదరాబాద్: తెలంగాణలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ముఖ్యంగా కొన్ని జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోనూ కొన్ని ప్రాంతాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Related News

ఏపీ లోని రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మొత్తంమీద ఏపీ, తెలంగాణలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.