Railway : అలాంటి వారికీ రైల్వే శాఖ శుభవార్త..!!

దివ్యాంగులకు భారత రైల్వే శుభవార్త చెప్పింది. దివ్యాంగులు ఇకపై రైల్వే పాస్‌ల కోసం రైల్వే కార్యాలయాలు, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దీని కోసం ఇండియన్ రైల్వేస్ కొత్త ఆన్‌లైన్ పాస్ సేవను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇంటి నుండి పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి రైల్వేలు రాయితీ ప్రయాణ సౌకర్యాలను అందిస్తోంది. రైళ్లు, బస్సులలో ప్రత్యేక సీట్లను కేటాయించడంతో పాటు ఛార్జీలలో కూడా రాయితీ ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీని కోసం ప్రత్యేకంగా http://divyangjanid.indianrail.gov.in అనే వెబ్‌సైట్ ప్రారంభించబడింది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వంటి వివరాలతో ముందుగా నమోదు చేసుకోండి. ఈ క్రమంలో మీరు ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత, మీరు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తును పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా ఒక ప్రత్యేకమైన వైకల్య ID కార్డ్ కూడా మంజూరు చేయబడుతుంది. ఈ విధంగా మీరు రైల్వే పాస్‌ల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.