టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ నిర్మూలనకు తన గాత్రాన్ని జోడించారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రభాస్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
జీవితంలో చాలా ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించేవాళ్లు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నప్పుడు.. మందు కావాలా ప్రియతమా? అని ప్రభాస్ ప్రశ్నించారు.
‘డ్రగ్స్‌కు నో చెప్పండి’ అని అభిమానులను, సినీ ప్రేమికులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 8712671111 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మత్తుకు బానిసలైన వారు పూర్తిగా కోలుకునేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ వీడియోలో ప్రభాస్ తెలిపారు.