ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో చాలా పొదుపు చేయాలని చూస్తున్నారు. వారి ఆదాయాన్ని బట్టి ఎంత పొదుపు చేయాలో నిర్ణయిస్తారు. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. అందుకోసం ప్రభుత్వాలు కూడా అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. కానీ ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన పథకాల గురించి ఎక్కువగా తెలుసు. అయితే అబ్బాయిల కోసం చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి
ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడులను అందించడంలో భారత ప్రభుత్వ రంగ పోస్టాఫీసు మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. పోస్టాఫీసులు మగ పిల్లల కోసం కొన్ని ప్రత్యేక పొదుపు పథకాలను కూడా అందిస్తున్నాయి. అందులో కిసాన్ పత్ర పథకం ఒకటి. చిన్న మొత్తాన్ని పొదుపు చేయాలనుకునే వారికి ఈ పథకం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న ఈ పథకం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా పోస్ట్ అందించే ఈ పథకాన్ని 1988లో ప్రవేశపెట్టారు. మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తల్లిదండ్రులు సంవత్సరానికి నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1000 కాగా, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
Related News
ఇది పెట్టుబడి పెట్టిన మొత్తంపై 7.9 శాతం వడ్డీని పొందుతుంది. మరియు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. వికాస్ పత్ర సర్టిఫికేట్ ఒక పోస్టాఫీసు నుండి మరొక పోస్టాఫీసుకు బదిలీ చేయబడుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ విషయానికొస్తే 10 ఏళ్ల 4 నెలలుగా నిర్ణయించారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు కూడా తక్కువ వడ్డీకే రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది.