దేశంలో ధరలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆదాయం పెరగడం లేదు. ఆదాయం పెరిగినా.. అందులో ఎక్కువ శాతం పన్నులకే వెళ్తుంది. ప్రజలు ఆదాయపు పన్ను చెల్లిస్తుండగా.. తాము కొనుగోలు చేసే వస్తువులపై కూడా జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఉద్యోగులే కాదు.. వ్యాపారం చేసే వారు కూడా ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నారు.
ప్రజల సమస్యలను పట్టించుకునేది ఏంటి.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా.. లేదా అన్నదే పాయింట్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లుగా.. ప్రజలు కూడా కనిపెట్టలేని విధంగా దాచిన పన్నులు వేస్తున్నారు. వాటిలో పాప్‌కార్న్ పన్ను ఒకటి. మీరు పాప్‌కార్న్‌ను ఒకే ఉత్పత్తిగా పరిగణించకూడదు. దాని రుచిని బట్టి రేటు ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకోవాలి.. ముఖ్యంగా ఉప్పు, కారం, పాకం.. వీటిపై విధించే పన్నులు రుచిలో మాత్రమే భిన్నంగా ఉండవని గ్రహించాలి. లేదంటే జేబులో నొప్పిగా ఉంటుంది.
ప్రస్తుతం ‘పాప్‌కార్న్ ట్యాక్స్’పై సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. చక్కెర ఎక్కువగా తింటే పన్ను కట్టాల్సి వస్తుందని తెలుసు. కానీ, షుగర్ పాప్ కార్న్ తింటే ‘పన్ను’ కట్టాల్సిందేనని ఇప్పుడే తేలిపోయిందని కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా, పాప్‌కార్న్ అంటే ‘అదే’ అనే ఆలోచన మనకు ఉంటుంది. రుచి, పరిమాణాన్ని బట్టి అక్కడక్కడ రూపాయి ఖర్చవుతుందని భావిస్తున్నాం. కానీ, ప్రభుత్వం మాత్రం మరో కోణంలో చూస్తోంది. పన్నులు విధిస్తోంది. సాల్టెడ్ పాప్‌కార్న్‌పై ఒక జీఎస్టీ, పంచదార పాకం పాప్‌కార్న్‌పై మరో జీఎస్టీ వసూలు చేస్తూ ఆహారాన్ని లాక్కుంటోంది.
ఇదిగో.. ఇలా దోపిడీ చేస్తున్నారు
మార్కెట్‌లో పాప్‌కార్న్‌ను అనేక రూపాల్లో విక్రయిస్తున్నారు. ముందుగా ప్యాక్ చేసిన, రెడీ టు ఈట్ స్నాక్స్ (సాల్టెడ్ పాప్ కార్న్)పై ప్రభుత్వం 12 శాతం జీఎస్టీ విధిస్తోంది. కారామెలైజ్డ్ పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. లాజిక్ ఏంటని ఆరా తీస్తే.. ఉప్పు, మసాలాలు కలిపినవి 12 శాతం జీఎస్టీ శ్లాబ్ కిందకు వస్తాయని, పాకం పట్టిన వస్తువులు.. అంటే పాప్ కార్న్ ను పంచదార కలిపితే.. అది 18 % పరిధిలోకి వస్తుందని కొత్త కథనం చెబుతున్నారు. స్వీట్లు. అందుకే 18 శాతం జీఎస్టీ శ్లాబులో పెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే, ఇది ప్యాక్ చేసిన పాప్‌కార్న్‌కు మాత్రమే. మీరు ప్యాక్ చేయని పాప్‌కార్న్‌ను కొనుగోలు చేస్తుంటే.. 5 శాతం మాత్రమే జీఎస్టీ వసూలు చేస్తారు.
అంటే నాకు అర్థమైంది.. థియేటర్‌లో పాప్‌కార్న్ కొనేప్పుడు ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే, మీ చేతి నూనెను వదిలివేయండి. ఈ జీఎస్టీ గురించి తెలియగానే.. పాప్ కార్న్ ప్రియులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పాప్‌కార్న్‌ను.. పాప్‌కార్న్‌గా చూడకూడదని.. దానికి జోడించిన పదార్థాలకు ముడిపెట్టి విపరీతమైన పన్నులతో వడ్డించకూడదని అంటున్నారు. కొంచెం పంచదార కలిపితే ఏకంగా 18 శాతం జీఎస్టీ విధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక ఉత్పత్తి ఉన్నపుడు దానికి జోడించిన పదార్థాల ఆధారంగా జీఎస్టీ ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటూ భిన్నత్వంలో ఏకత్వం కోరుకుంటున్న మీరు ఏకత్వంలో భిన్నత్వాన్ని ఎలా సమర్థిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు.