అదిరిపోయే ఫీచర్లతో Poco F6 స్మార్ట్ ఫోన్…

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో తాజాగా భారత్‌లో పోకో F6 5G హ్యాండ్‌సెట్‌ను (Poco F6 5G Smartphone) విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మరియు 1.5k రిజల్యూషన్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో విడుదలైన రెడ్‌మి టర్బో 3కి రీబ్రాండెడ్‌గా లాంచ్ అయినట్లు తెలుస్తోంది.

పోకో F6 5G స్పెసిఫికేషన్‌లు :

పోకో F6 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1220*2712 పిక్సల్‌ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2400 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 446 ppi పిక్సల్‌ డెన్సిటీతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్, Widevine L1 సపోర్టు చేస్తుంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంటుంది.

పోకో కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 Hyper OS పైన పనిచేస్తుంది. 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఆక్టాకోర్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB LPDDR5x ర్యామ్‌, 512GB UFS 4.0 తో జతచేయబడి ఉంటుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే పోకో F6 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP 1/1.9 అంగుళాల సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో వచ్చింది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, సెల్ఫీ- వీడియో కాల్స్ కోసం 20MP OV20B కెమెరాను కలిగి ఉంది.

90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో : దీంతోపాటు ఈ పోకో F6 5G స్మార్ట్‌ ఫోన్‌ Iceloop కూలింగ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఫోన్‌ ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, వైఫై 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టు సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు యాక్సెలిరో మీటర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్, ఈ-కాంపాస్, గైరోస్కోప్‌, IR బ్లాస్టర్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ డాల్బీ అట్మాస్ సపోర్టుతో హైబ్రిడ్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు Hi-Res సర్టిఫికేషన్‌తో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో లాంచ్‌ అయింది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

పోకో F6 5G ధర, సేల్‌ వివరాలు :

పోకో F6 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.29,999 గా ఉంది. 12GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.31,999 గా ఉంది. 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ ధర రూ.33,999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

ఎక్స్చేంజీ ద్వారా అదనంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మొత్తంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా.. బేస్‌ వేరియంట్‌ను రూ.25,999 కే కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.27,999 మరియు 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. బ్లాక్‌ మరియు టైటానియం రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మే 29 12PM నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.