KYC అప్డేట్ చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?
PNB ఇప్పటికే కస్టమర్లకు రిమైండర్లు పంపిస్తూ వచ్చింది. కానీ, KYC అప్‌డేట్ చేయకపోతే మీ ఖాతాలోని లావాదేవీలపై నిషేధం (Restriction) విధించవచ్చు. డబ్బు జమ చేయడం, డ్రా చేయడం వంటి లావాదేవీలు నిలిచిపోవచ్చు.
ఇంతకు ముందు KYC అప్‌డేట్ చివరి తేదీ డిసెంబర్ 31, 2024గా ప్రకటించగా, ఇప్పుడు దీనిని మార్చి 26, 2025 వరకు పొడిగించారు. అయితే, ఖాతాదారులు ఏప్రిల్ 10, 2025లోగా ఖచ్చితంగా బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి KYC అప్‌డేట్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఎందుకు బ్యాంక్ KYC అప్‌డేట్ కోరుతోంది?
KYC అనేది బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రక్రియ. ఇది ఖాతాదారుల గుర్తింపు వివరాలను ధృవీకరించి, ఆర్థిక నేరాలు, మోసాలను నివారించేందుకు ఉపయోగపడుతుంది.
PNB బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ జారీ చేస్తూ, అనుమానాస్పద SMS లింకులు, అపరిచిత వ్యక్తుల కాల్స్ లేదా డౌన్‌లోడింగ్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని హెచ్చరించింది.
ఎలా KYC అప్‌డేట్ చేయాలి?
బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. PNB One యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ (IBS) ద్వారా కూడా KYC అప్‌డేట్ చేయొచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా అవసరమైన వివరాలు పంపించవచ్చు. ఏప్రిల్ 10లోగా KYC అప్‌డేట్ చేయకపోతే ఖాతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.
PNB ఖాతాదారులు వెంటనే స్పందించాలి
PNB బ్యాంక్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ఖాతాదారులకు తెలియజేసింది. RBI మార్గదర్శకాల ప్రకారం KYC అప్‌డేట్ తప్పనిసరి అని పేర్కొంది. గతంలో KYC గడువు మార్చి 26, 2025గా ప్రకటించగా, ఇప్పుడు ఏప్రిల్ 10లోగా ఖచ్చితంగా పూర్తిచేయాలని హెచ్చరిక జారీ చేశారు. అలసత్వం వహిస్తే ఖాతాలో లావాదేవీలు నిలిచిపోవచ్చు. కాబట్టి వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి KYC అప్‌డేట్ చేసుకోవడం మర్చిపోకండి.