ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులందరూ ఎంతగానే ఎదురుచూస్తున్న 20వ విడత త్వరలో విడుదల కానుంది. మీరు కూడా ఈ పథకానికి లబ్ధిదారుడేనా? అయితే ఈ రాయితీ వచ్చే తేదీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం… ఈ పథకం ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది.
PM-Kisan 20వ విడత విడుదల తేదీ ఎప్పుడంటే?
ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా 20వ విడత డబ్బులు విడుదల చేసే తేదీని ప్రకటించలేదు. కానీ మునుపటి విడతల విడుదల టైం లైన్‌ని పరిశీలిస్తే, జూన్ చివరి లేదా జూలై 2025 ప్రారంభంలో ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసే అవకాశం ఉంది. అయితే, అధికారిక ప్రకటన కోసం కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.
ఈ 20వ విడత డబ్బులు అందుకునే రైతులు ఎవరు?
20వ విడతను పొందాలంటే మీ e-KYC తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. e-KYC పూర్తయ్యాకే రైతుల బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయి. మీరు ఇంకా KYC పూర్తి చేయకపోతే వెంటనే పూర్తిచేయండి.