వర్షాకాలం వచ్చిందంటే చలికి ఎక్కడ పడితే అక్కడ పాములు, పురుగులు ప్రత్యక్షమై మనల్ని భయాందోళనకు గురిచేస్తాయి ఈలోగా వాహనాల్లోకి కూడా తోచేరతారయి.. జాగర్త గ ఉండాలి
అయితే వర్షాకాలం పూర్తయ్యే వరకు పాములు గోల ఉంటూనే ఉంటుంది చాల ప్రమాదకరం. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఇంటి ఆవరణలో, పొలాల్లో, వీధుల్లో, పొదల్లో పాములు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇంటి చుట్టూ ఉన్న చెత్తను శుభ్రం చేయకపోతే చాలా ప్రమాదకరం. అందులో పాములు చేరే అవకాశం ఉంది
మనం జాగర్త గ లేకుంటే కాటేసే ప్రమాదం ఉంది ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది.
కానీ కొంతమంది ఇళ్లల్లో చెట్లను పెంచుతారు.. అయితే కొన్ని చెట్లను పెంచడం వల్ల ఇంటి ఆవరణలో పాములు చేరతారయి అని మీకు తెలుసా ! కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు ఈ చెట్లను తొలగించాలి. లేకుంటే చాల ప్రమాదం అనే చెప్పాలి
*మల్లె చెట్టు ఎంత సువాసన వెదజల్లుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో కూడా మల్లెపూల వాసన వెదజల్లుతూనే ఉంటుంది . కొంతమందికి వాటి సువాసన లో మత్తు ఉంటుంది. కానీ చాలా మంది తమ పెరట్లో మల్లె చెట్టును పెంచుతారు. కానీ కొన్నిసార్లు అది ప్రమాదకరంగా మారవచ్చు. మల్లె చెట్టు గుబురుగా ఉండడంతో ఆ పూల సువాసన కోసం పాములు ఆ పొదల్లోకి ప్రవేశిస్తాయి. చెట్టు దగ్గరికి వెళ్తే ప్రమాదం పొంచి ఉన్నట్టే . కాబట్టి వర్షాకాలంలో మల్లె చెట్లను పెంచక పోవటం మంచిది.
*అలాగే నిమ్మచెట్టు వర్షాకాలంలో ప్రమాదకరం. దీని కారణంగా అనేక కీటకాలు, పక్షులు మరియు ఎలుకలు చెట్టుపైకి వస్తాయి. అలాగే పాములు వాటి కోసం చెట్టు దగ్గరికి వస్తాయి. అందుకే నిమ్మచెట్లను పెంచేవారు జాగ్రత్తగా ఉండాలి.
* దానిమ్మ చెట్టు : ఈ చెట్టు యొక్క వేర్లు, ఆకులు మరియు కాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి, కాబట్టి దీనిని సాగు చేస్తారు. కానీ ఈ చెట్టు వాళ్ళ కూడా ఇళ్లలో పాములు చేరే అవకాశం ఉంది . కాబట్టి దానిమ్మ చెట్టు వర్షాకాలం మంచిది కాదు.
* ఇంటి చుట్టూ పచ్చదనం కనిపించాలని ఇటీవలి కాలంలో చాలా మంది గడ్డి మొక్కలను పెంచుతున్నారు. కొందరు వారానికోసారి కోత పెడుతున్నారు. కొన్నిసార్లు వాటిని మరచిపోతే అవి పొదలుగా మారి పాములు అందులోకి ప్రవేశించి ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి వర్షాకాలంలో గడ్డి మరియు ఇతర చెట్లను పూర్తిగా తొలగించడం మంచిది.