భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ 113 వేర్వేరు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడుతున్న ఉద్యోగాలకు అర్హులైన వారు ఫిబ్రవరి 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
భర్తీ చేయబడుతున్న పోస్టులు
ఫోటోగ్రాఫర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫైర్‌మ్యాన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, వాషర్‌మ్యాన్, కార్పెంటర్ & జాయినర్, టిన్-స్మిత్ ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి.
పోస్టుల సంఖ్య
ఈ నియామక నోటిఫికేషన్ ద్వారా మొత్తం 113 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఫోటోగ్రాఫర్ – 01
- అకౌంటెంట్ – 01
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 – 01
- లోయర్ డివిజన్ క్లర్క్ – 11
- స్టోర్ కీపర్ – 24
- ఫైర్‌మ్యాన్ – 05
- కుక్ – 04
- ల్యాబ్ అటెండెంట్ – 01
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 29
- ట్రేడ్స్‌మన్ మేట్ – 31
- వాషర్‌మ్యాన్ – 02
- కార్పెంటర్ & జాయినర్ – 02
- టిన్ – స్మిత్ – 01
విద్యా అర్హతలు
పోస్టుల ప్రకారం అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
జీతం
ఫోటోగ్రాఫర్ ఉద్యోగాలకు జీతం స్కేల్ 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది.
అకౌంటెంట్ ఉద్యోగాలకు జీతం స్కేల్ 29,200/- నుండి 92,300/- వరకు ఉంటుంది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు జీతం స్కేల్ 25,500/- నుండి 81,100/- వరకు ఉంటుంది.
లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు పే స్కేల్ 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది.
స్టోర్ కీపర్ ఉద్యోగాలకు పే స్కేల్ 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది.
ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలకు పే స్కేల్ 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది.
కుక్ ఉద్యోగాలకు పే స్కేల్ 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది.
ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు పే స్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పే స్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.
ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలకు పే స్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.
వాషర్‌మ్యాన్ ఉద్యోగాలకు పే స్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.
కార్పెంటర్ & జాయినర్ ఉద్యోగాలకు జీతం స్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.
టిన్ – స్మిత్ ఉద్యోగాలకు జీతం స్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.
- వయస్సు
- అకౌంటెంట్ ఉద్యోగాలకు, వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు, వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు, వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
- స్టోర్ కీపర్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఫోటోగ్రాఫర్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- కుక్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
- మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ట్రేడ్స్‌మన్ మేట్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- వాషర్‌మన్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- కార్పెంటర్ & జాయినర్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సు సడలింపు వివరాలు
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 06-02-2025
ఎంపిక విధానం
రాత పరీక్ష ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టులను బట్టి ట్రేడ్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ / షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది.