ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ పీజీ విద్యార్థినులు సరికొత్త అవిష్కరణ ..

ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పీజీ విద్యార్థులు కొత్త ఆవిష్కరణ చేశారు. మహిళల రుతుక్రమంలో వృధా అయ్యే రక్తం నుండి ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్స్‌ను వేరు చేశారు. వాటిని ఉపయోగించి 3డి ప్రింటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశోధన ఆధారంగా 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని వారు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now