ఈ నెల 30, 31 తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా రాష్ట్రంలోని (ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా రెండు ప్రభుత్వ సెలవులతో ఉద్యోగులకు కూడా కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు.
కానీ తాజా ఆదేశాల ప్రకారం.. ఆ ఉద్యోగులకు సెలవులు ఉండవని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ప్రభుత్వం (ఏపీ ప్రభుత్వం) మార్చి 30, 31 తేదీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వ సెలవుల నుండి మినహాయింపు ఇచ్చింది. అయితే, ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా, ఈ నెల 30, 31 తేదీలను రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటించింది. ఆ రెండు రోజులు (ఉగాది, రంజాన్) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.