ఇప్పుడు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి బెస్ట్ మార్గాలు
హెల్త్ ఇన్షూరెన్స్ – డబుల్ లాభం
ఆరోగ్య బీమా అనేది కేవలం వైద్య ఖర్చులను కవరింగ్ చేయడమే కాదు, ట్యాక్స్ ఆదా చేసేందుకు కూడా చాలా మంచి మార్గం. సెక్షన్ 80D ప్రకారం, ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా మీరు ₹75,000 వరకు పన్నును సేవ్ చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు మరియు తల్లిదండ్రులకు హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకుంటే మరింత లాభం పొందవచ్చు. వైద్య ఖర్చుల భారం తగ్గడంతో పాటు ట్యాక్స్ మినహాయింపు పొందే చక్కటి అవకాశం ఇది.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సేవింగ్
మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో మీ ఆస్తిని విక్రయించి అధిక లాభం పొందినట్లయితే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్ అవుతుంది. అయితే, 54EC బాండ్స్‌లో పెట్టుబడి పెడితే ₹50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు NHAI (National Highways Authority of India) లేదా REC (Rural Electrification Corporation) వంటి సంస్థల 54EC బాండ్స్‌లో డబ్బు పెట్టాలి. కానీ దీన్ని మార్చి 31, 2025లోగా తప్పకుండా పూర్తి చేయాలి. ఈ అవకాశం కోల్పోతే పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ట్యాక్స్ సేవింగ్ స్కీముల్లో పెట్టుబడి
ప్రస్తుతం పన్నును ఆదా చేయడానికి అనేక ప్రయోజనకరమైన స్కీములు అందుబాటులో ఉన్నాయి. NSC (National Savings Certificate), FD (Fixed Deposit), ELSS (Equity Linked Saving Scheme) మ్యూచువల్ ఫండ్స్, PPF (Public Provident Fund) వంటి పథకాల్లో పెట్టుబడి పెడితే ₹1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఇవి భద్రతతో పాటు మంచి ఆదాయాన్ని కూడా అందించే ట్యాక్స్ సేవింగ్ మార్గాలు.
Related News
NPS పెట్టుబడి – అదనపు ప్రయోజనం
మీరు ఇప్పటికే సెక్షన్ 80C ద్వారా ₹1.5 లక్షల వరకు ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నట్లయితే, NPS (National Pension System) ద్వారా అదనంగా ₹50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ఈ పథకం ద్వారా రిటైర్మెంట్‌కు సేవింగ్ చేయడమే కాకుండా, అదనంగా పన్ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
31 మార్చిలోపు ఈ పన్ను సంబంధిత పనులు పూర్తిచేయండి
పెనాల్టీ లేకుండా ప్లాన్ చేయండి
మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, దాన్ని మార్చి 31, 2025లోగా సరిదిద్దుకోవచ్చు. లేకపోతే, మీరు అదనపు జరిమానా లేదా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కనుక ఇది మీకు చివరి అవకాశం.
TDS ఖచ్చితంగా మ్యాచ్ చేసుకోండి
చాలా మంది ఉద్యోగుల జీతం లేదా పెట్టుబడుల నుండి TDS (Tax Deducted at Source) కట్ అవుతుంది. Form 26AS మరియు AIS (Annual Information Statement) లో మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే మార్చి 31లోపు సరిచేయించుకోండి. లేదంటే, మీరు చెల్లించిన పన్నుకు సరైన క్రెడిట్ రావకపోవచ్చు.
లాభనష్టాలపై సమీక్ష చేయండి
ఇది మీ పెట్టుబడులను సమీక్షించడానికి ఉత్తమ సమయం. మీరు ఎక్కడ లాభాలు పొందుతున్నారో, ఎక్కడ నష్టాలు వస్తున్నాయో విశ్లేషించండి. అలాగే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సేవ్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోండి. తద్వారా, మీరు కొత్త ఆర్థిక సంవత్సరానికి మంచి పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
ఇప్పుడే ఈ పనులు చేయకపోతే లక్షల్లో పన్ను ఆదా చేసే అవకాశం కోల్పోతారు. మార్చి 31కు ముందు అన్ని పనులను పూర్తి చేసుకోండి, లేదంటే కఠినమైన జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.