ఇంటర్ అర్హతతో ఎయిర్‌పోర్ట్ లో జాబ్స్.. మంచి జీతం .. వెంటనే అప్లై చేసుకోండి

ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలను వదులుకోవద్దు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ పాస్ అయితే చాలు. ఇటీవల, న్యూఢిల్లీలోని IGI ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం Download Notification pdf

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి Online apply link

Related News

ముఖ్యమైన సమాచారం :

ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు: 1,074

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్‌/12వ తరగతి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: రూ.350 చెల్లించాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌ లైన్‌

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-03-2024
  • దరఖాస్తులకు చివరి తేదీ: 22-05-2024