ఒక వ్యక్తికి క్రెడిట్ కార్డ్ బకాయిలు, పర్సనల్ లోన్లు, మెడికల్ బిల్లులు వంటి విభిన్న రకాల అప్పులు ఉంటే, వాటిని ఒక్కటిగా కలిపి ఒకే లోన్ తీసుకోవడాన్ని డెబ్ట్ కన్సాలిడేషన్ అంటారు. అంటే, ప్రతి నెలా చాలాచోట్ల EMI కట్టాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒకే ఒక్క లోన్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ ఆదా చేసే అవకాశం ఇస్తుంది.
పర్సనల్ లోన్‌తో డెబ్ట్ కన్సాలిడేషన్ ప్రయోజనాలు
బ్యాంకులు, NBFCలు పర్సనల్ లోన్‌లను చాలా తక్కువ సమయంలో అప్రూవ్ చేసి మీ ఖాతాలో డబ్బును జమ చేస్తాయి. అందువల్ల, ఈ లోన్ ద్వారా మీరు ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చు:
- త్వరిత అప్రూవల్ – మాములుగా కొన్ని గంటల్లోనే లోన్ మంజూరు అవుతుంది.
- ఆన్‌లైన్ అప్లికేషన్ – ఎక్కువ భాగం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి.
- కోలాటరల్ అవసరం లేదు – ఈ లోన్‌కు ఎలాంటి ఆస్తి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
- ఇష్టమైన పద్దతిలో తిరిగి చెల్లింపు – 1 నుండి 5 సంవత్సరాల వరకు ఎంపిక చేసుకునే వీలుంటుంది.
- ఒక్కటే EMI – మీ క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఇతర లోన్లు అన్నీ కలిపి, కేవలం ఒక్క EMI మాత్రమే చెల్లించవచ్చు.
ఎందుకు పర్సనల్ లోన్ తీసుకోవాలి?
- సులభమైన రీపేమెంట్: ప్రతి నెలా ఒక్కటే డేట్ గుర్తు పెట్టుకోవాలి, మిగతా అన్ని డబ్బులు క్లియర్ అవుతాయి.
- తక్కువ వడ్డీ రేట్లు: ఉన్న లోన్ల కంటే తక్కువ వడ్డీ రేటుతో తీసుకోవచ్చు, దీని వల్ల పొదుపు అవుతుంది.
- స్పష్టమైన గడువు: లోన్ ఎంత కాలానికి తిరిగి చెల్లించాలో ముందే నిర్ణయించుకోవచ్చు, దీని వల్ల ఆర్థిక భారం సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
డెబ్ట్ కన్సాలిడేషన్ కోసం పర్సనల్ లోన్ ఇస్తున్న బ్యాంకులు
- SBI
- HDFC Bank
- ICICI Bank
- Kotak Mahindra Bank
- Axis Bank
- Bajaj Finserv
- Tata Capital
లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు
- క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి – మంచి స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందొచ్చు.
- అర్హతను పరీక్షించుకోవాలి – ప్రతి బ్యాంక్ లేదా NBFCకు విడివిడిగా అర్హత నిబంధనలు ఉంటాయి.
- వడ్డీ రేట్లు పరిశీలించాలి – సాధారణంగా 10.99% నుండి 24% మధ్య వడ్డీ రేట్లు ఉంటాయి. తక్కువ వడ్డీ ఉన్న ఆఫర్ ఎంచుకోవాలి.
గమనిక
మీకు బ్యాంకులు, ఆన్‌లైన్ లోన్ ప్రొవైడర్లు డెబ్ట్ కన్సాలిడేషన్ లోన్లు అందిస్తారు. కానీ మీ ఆర్థిక స్థితిని బట్టి, లోన్ నిబంధనలను అర్థం చేసుకుని, సరైన ఎంపిక చేసుకోవడం మంచిది. అంతా కలిపి ఒకటిగా చేయడం వల్ల EMI భారం తగ్గడం ఖాయం, కానీ సరైన ప్లానింగ్ లేకుంటే మళ్లీ అప్పుల ఊబిలో పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే, లోన్ తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి!
(గమనిక: లోన్ తీసుకోవడం కొంత ముప్పుతో కూడిన వ్యవహారం. సరైన ఆర్థిక యాజమాన్యంతో మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకోవాలి.)