ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 5 నుంచి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకంలో పేదవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 10 లోపు ఒక లక్ష మంది ఈ పథకంలో చేరనున్నారు. దీని వల్ల ఢిల్లీలో ఆరోగ్య సేవలు మరింత మెరుగవుతాయి.
ఈ పథకం ద్వారా ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన (AAY) కింద ఉన్న కుటుంబాలకు మొదటగా లబ్ధి అందనుంది. AAY పథకం కింద పేద కుటుంబాలకు నెలకు 35 కేజీల బియ్యం, గోధుమలు సబ్సిడీ రేటుతో అందిస్తారు. ఇక ఇప్పుడు అదే కుటుంబాలకు ఐష్మాన్ భారత్ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా కూడా ఉచితంగా లభించనుంది.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేషెంట్ హెల్త్ రికార్డులు డిజిటల్‌గా నిర్వహించనున్నారు. దీని వల్ల చికిత్సలు అందరికీ సులభంగా, సమర్థంగా అందుతాయి. మొదటి దశలో కార్డులు జారీ చేసి, తర్వాత మరిన్ని లబ్ధిదారులకు విస్తరించనున్నారు. ప్రాథమిక వైద్యం మెరుగవుతుంది, వైద్య సేవల్లో సమర్థత పెరుగుతుంది.
Related News
ఈ స్కీమ్ అమలు కోసం కేంద్రం ప్రారంభించిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, పీఎం-జెఎవై, అయుష్మాన్ ఆరోగ్య మందిర్, డైగ్నోస్టిక్ ఫెసిలిటీస్, క్రిటికల్ కేర్ బ్లాక్లతో కలిపి సమగ్ర ఆరోగ్య సేవలు అందించనున్నారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, క్యాబినెట్ తొలి సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించింది.
ఢిల్లీ ఆరోగ్య బడ్జెట్‌ను 48 శాతం పెంచుతూ రూ.12,893 కోట్లు కేటాయించారు. గతంలో ఆప్ ప్రభుత్వం కేవలం రూ.8,685 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తంలో రూ.2,144 కోట్లు ఐష్మాన్ భారత్ పథకానికే కేటాయించబడింది. ఇందులో రూ.7 లక్షల బీమా ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం భరించనుంది. మిగిలిన రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది.
ఇక, PM-ABHIM పథకం కోసం రూ.1,666 కోట్లు, PMJAY కోసం రూ.147 కోట్లు, అలాగే ఆరోగ్య డిజిటల్ మిషన్ కోసం రూ.10 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం ఆధునిక హెల్త్ డేటా, టెక్నాలజీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించనున్నారు.
ఢిల్లీ ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే రూ.10 లక్షల ఆరోగ్య బీమా కవర్ – ఇలాంటి అవకాశం మళ్లీ రాదు… వెంటనే అప్లై చేయండి.