SBI సూపర్ ఆఫర్! బంగారం పెట్టి డబ్బు సంపాదించండి.. ఈ సూపర్ స్కీమ్‌తో వడ్డీ కూడా వస్తుంది…

సాధారణంగా మనం బంగారం భద్రంగా ఉండాలంటే బ్యాంక్ లాకర్ ఆప్షన్ తీసుకుంటాం, కానీ దానికి ఫీజు కట్టాల్సి వస్తుంది. అయితే, SBI కస్టమర్లకు ఓ అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. ఇప్పుడు మీ బంగారాన్ని భద్రంగా ఉంచుకునే కాకుండా, దానిపై వడ్డీ కూడా పొందవచ్చు. ఇది SBI Revamped Gold Deposit Scheme (R-GDS) ద్వారా సాధ్యమవుతోంది. ఈ స్కీమ్‌లో మీ బంగారాన్ని బ్యాంక్‌లో ఉంచితే, మీరు సురక్షితంగా నిల్వ చేసుకోవడమే కాకుండా, అందుకు వడ్డీ కూడా పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SBI Gold Deposit Scheme: బంగారం డిపాజిట్‌కు 3 Categories

SBI Revamped Gold Deposit Scheme (R-GDS) లో బంగారాన్ని మూడు విధాలుగా డిపాజిట్ చేయవచ్చు:

  1. Short-Term Bank Deposit (STBD) – 1 నుంచి 3 సంవత్సరాల పాటు డిపాజిట్ చేసుకోవచ్చు.
  2. Medium-Term Government Deposit (MTGD) – 5 నుంచి 7 ఏళ్ల వరకు ఉండే డిపాజిట్.
  3.  Long-Term Government Deposit (LTGD) – 12 నుంచి 15 ఏళ్ల వరకు ఉండే డిపాజిట్.

ఎంత వడ్డీ వస్తుంది?

1. Short-Term Bank Deposit (STBD)

Related News

  • 1 సంవత్సరం కాలపరిమితి: 0.55% వార్షిక వడ్డీ
  • 2 లేదా 3 సంవత్సరాల డిపాజిట్‌కి 0.60% వార్షిక వడ్డీ

2. Medium-Term Government Deposit (MTGD) – (5-7 సంవత్సరాలు)

  • 2.25% వార్షిక వడ్డీ

3. Long-Term Government Deposit (LTGD) – (12-15 సంవత్సరాలు)

  • 2.50% వార్షిక వడ్డీ

* గమనించాల్సిన విషయం – MTGD, LTGDలో మీ ప్రిన్సిపల్ (అసలు మొత్తం) బంగారం రూపంలోనే లెక్కించబడుతుంది. కానీ వడ్డీ మాత్రం భారతీయ రూపాయలలో ప్రతి ఏడాది మార్చి 31న లేదా మెచ్యూరిటీకి వచ్చే సమయానికి చెల్లిస్తారు.

Gold Maturityకు 2 సూపర్ ఆప్షన్స్

బంగారం డిపాజిట్ పూర్తి కాలపరిమితి అయిన తర్వాత, కస్టమర్లు రెండు రకాలుగా తమ డిపాజిట్‌ను తిరిగి పొందవచ్చు:

  1. తమ బంగారాన్ని తిరిగి బంగారం రూపంలోనే పొందుకోవచ్చు.
  2. అప్పుడు ఉన్న మార్కెట్ రేటుకి తగ్గట్టుగా నగదు రూపంలో తీసుకోవచ్చు.

ఈ స్కీమ్ 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంట్లో లేదా సంస్థల్లో నిష్క్రియంగా ఉన్న బంగారాన్ని ఉపయోగకరంగా మార్చడమే లక్ష్యం. అలాగే, ప్రజలకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడమే ఈ పథకానికి ఉద్దేశ్యం.

మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో ఉంచకుండా, ఈ సూపర్ స్కీమ్ ద్వారా భద్రంగా పెట్టుబడి చేసి, అదనపు వడ్డీ పొందండి