రంపచోడవరం : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రంపచోడవరం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.సుధాకర్ తెలిపారు.
ఈ కోర్సులో చేరేందుకు 10వ తరగతి విద్యార్హత అని తెలిపారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2023 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్లం చదివిన వారికి, మున్సిపాలిటీలో చదివిన వారికి 75:25 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారని తెలిపారు.
జూన్ 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www. ANGRAU.AC.in ను సందర్శించాలని ఆయన సూచించారు. జిల్లాలో రంపచోడవరం మాత్రమే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అని తెలిపారు.
ఈ కళాశాలల్లో 2013 రెండేళ్ల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కళాశాలలో చదివిన నలుగురు విద్యార్థులు 2023లో అగ్రిసెట్ లో ర్యాంకులు సాధించారని.. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయన్నారు.
ద్వితీయ సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో నేరుగా పీఏఎంపీ ద్వారా వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ వ్యాపారం తదితర నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకుంటారని తెలిపారు. ఏవైనా సందేహాలుంటే కళాశాలకు వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 8247848525 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.