రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కోసం నితిన్ గడ్కరీ పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత బాధితులకు తక్షణ చికిత్స ఖర్చు రూ.1.5 లక్ష వరకు అందజేస్తామని గడ్కరీ తెలిపారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన నితిన్ గడ్కరీ కొత్త పథకం వివరాలను వెల్లడించారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే మృతుడి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు.
ఆకస్మిక మరణం
“మేము ఈ నగదు రహిత ప్రాజెక్ట్‌ను కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నాము. మేము పథకంలో కొన్ని బలహీనతలను గమనించాము. మేము వాటిని మెరుగుపరుస్తాము. ఇది ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది” అని గడ్కరీ న్యూఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్‌లో అన్నారు. “మా మొదటి ప్రాధాన్యత రోడ్డు భద్రత.. 2024లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 1.8 లక్షల మందిలో 30,000 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోయారు. ప్రాణాంతక ప్రమాదాల్లో మరణించిన వారిలో 66% మంది 18-34 ఏళ్ల మధ్య వయసు వారు. స్కూళ్లు, కాలేజీల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల పొరపాట్ల వల్లే పిల్లలు చనిపోయారని గడ్కరీ అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి వల్ల జరిగే ప్రమాదాల్లో సుమారు 3 వేల మంది చనిపోయారని తెలిపారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని, అందుకోసం కొత్త విధానాన్ని కూడా రూపొందిస్తున్నామని వెల్లడించారు.