ఇప్పటికే అన్ని చోట్లా నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. మరికొందరు కుటుంబ సమేతంగా జరుపుకోగా.. మరికొందరు హోటళ్లు, రెస్టారెంట్లలో జరిగే కార్యక్రమాలకు హాజరుకావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 1వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నాయి.
అయితే.. ఈసారి కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరి 1వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. దీంతో జనవరి 1న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం జనవరి 1వ తేదీని సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ సెలవులు లేవని.. ఆ రోజు ఐచ్ఛిక సెలవు మాత్రమేనని తెలిసింది.
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేయనున్న సంగతి తెలిసిందే. అయితే.. డిసెంబర్ 31న చాలా మందికి నైట్ అవుట్ లు, పార్టీలు ఉంటాయి. ఈ క్రమంలో మరుసటి రోజే ఏపీ సర్కార్ ట్విస్ట్ తో కొంత మంది సతమత మవుతున్నారు .
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చాలా మంది వరుసగా సెలవులు తీసుకుని దేవాలయాలకు వెళ్లాలన్నా, సరదాగా గడపాలన్నా ప్రణాళికలు వేసుకుంటారు. అయితే ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందని కొందరు తలలు పట్టుకుంటున్నారు.