అది 2019 డిసెంబర్ నెల. పొరుగు దేశమైన చైనాలో కరోనా మహమ్మారి ఉద్భవించింది. అక్కడ మొదలైన ఆ వైరస్ ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెట్టింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మొత్తం చిన్నా భిన్నం చేసింది. ఎన్నో దేశాలు ఇప్పటికీ ఆ వైరస్ సృష్టించిన విధ్వసం బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో చైనాలో మరో వైరస్ ఉద్భవించింది. అక్కడ ఇటీవల కాలంలో చాలా మంది ఎదో గుర్తు తెలియని వ్యాధి కారణంగా ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో ప్రపంచం దేశాల్లో మళ్ళీ భయాందోళనలు మొదలయ్యాయి. మళ్ళీ కరోనా అవుతుందా అంటూ కలవర పడుతున్నారు. అయితే ఈ వైరస్ ఇండియాలోకి వస్తుందా? దాని సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియాలోకి వస్తుందా?
చైనాలో కొత్తగా విస్తరిస్తున్న వైరస్ కారణంగా భారతీయులు కూడా చాలా భయాందోళనలు చెందుతున్నారు. ఇది ఎక్కడ మన దేశంలో ప్రవేశిస్తుందోనని కంగారు పడుతున్నారు. అయితే ఈ వైరస్ మన ఇండియాలోకి వచ్చేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు. ఇటీవల చైనాతో మన దేశానికి ఉన్న తగాదాలు తగ్గిపోవడంతో పాటు ఇరు దేశాల బోర్డర్లు ఓపెన్ కావడంతో ఇది సులభంగా మన దేశంలోకి ప్రవేశిస్తుంది.
పైగా చైనా నుంచి టూరిస్టులు కూడా ఇటీవల మన దేశానికి ఎక్కువగా వస్తున్నారని, దాని కారణంగా ఈ వైరస్ ఇండియాలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు మన దేశానికి చెందిన చాలా మంది ఇటీవల కాలంలో టూర్స్ కోసమని ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారు. దీని కారణంగా వారికి కూడా వ్యాధి సోకె అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందా లేదా అనే క్లారిటీ లేనప్పటికీ, కరోనా లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాధి కూడా ఒకరి నుంచి మరొకరికి సోకె అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఒకరి నుంచి ఒకరికి సోకితే టూరిజం, వ్యాపారం, ఇతర మార్గాల ద్వారా అది మన దేశంలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది.
వైరస్ లక్షణాలు : చైనాలో కొత్తగా వైరస్ సోకిన వ్యక్తులకు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయట. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందులతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయట. ఈ కొత్త వైరస్ లక్షణాలు సైతం కరోనా మాదిరిగానే ఉండడంతో ప్రజలంతా భయపడుతున్నారు. ముప్పు ఎటువైపు నుంచి మళ్ళీ దాపురిస్తుందోనని కంగారు పడుతున్నారు. కరోనా మ్యుటేట్ చెంది మళ్ళీ ప్రమాదకరంగా మారి ప్రజలపై దాడి చేస్తుందా అనే భయాందోళనలో ప్రజలు బతుకుతున్నారు
నివారణ మార్గాలు : చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు. అందుకే మన దేశంలో ప్రమాదంలో పాదకుముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వైరస్ సోకినట్లు తెలిస్తే విమాన సర్వీసులను రద్దు చేయాలి. సోకిన వ్యక్తికి పరీక్షలు జరిపి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగా స్పందిస్తూ.. ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయాలి. ప్రమాద తీవ్రత ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడే ఇలాంటి పెనుముప్పుల నుంచి దేశంతో పాటు దేశంలోని ప్రజలను కూడా కాపాడుకోవచ్చు.