న్యూఢిల్లీ నుంచి మరోసారి పెద్ద వార్త బయటికొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త రూ.500 నోట్లను విడుదల చేయబోతోంది. అలాగే కొత్త రూ.10 నోట్లూ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ కొత్త నోట్లలో కొన్ని కీలకమైన మార్పులు ఉండనున్నాయి. అయితే ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న నోట్లు చెల్లుబాటు కావా అని భయపడాల్సిన అవసరం లేదు. అవి అలాగే చెల్లుబాటు అవుతాయి.
కొత్త నోట్లు – అయితే రూపం కొత్తగా…
ఈసారి విడుదల చేయబోయే రూ.10 మరియు రూ.500 నోట్లు మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో ఉండబోతున్నాయి. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న నోట్ల డిజైన్‌కే దగ్గరగా ఉంటాయి కానీ కొన్ని ముఖ్యమైన మార్పులు తప్పవు. రంగు, సైజు, థీమ్, సెక్యూరిటీ ఫీచర్‌ల స్థానంలో మార్పులు ఉంటాయని RBI తెలిపింది.
పాత నోట్లు ఇక పనికిరావా?
అంతకుముందే బయటికి వచ్చిన పాత రూ.10, రూ.500 నోట్లపై ఎటువంటి ప్రభావమూ ఉండదు. అవి పూర్తిగా చెల్లుబాటు అయ్యే నోట్లు. అంటే మీరు చేతిలో ఉన్న పాత నోట్లతో కూడా స్వేచ్ఛగా లావాదేవీలు చేసుకోవచ్చు. కొత్త నోట్లు మార్కెట్లోకి రావడంతో మీరు మాయమాటలు విని పాత నోట్లను తగ్గింపు ధరకు మారుస్తున్నారని ఎవరి దగ్గర మోసపోకండి.
Related News
రూ.100, రూ.200 కొత్త నోట్లూ త్వరలో
ఇది మాత్రమే కాకుండా, గత నెలలో RBI రూ.100, రూ.200 నోట్లను కూడా కొత్త రూపంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అంటే త్వరలో మన చేతుల్లో చాలా కొత్త నోట్లు కనిపించనున్నాయి. అన్నీ కూడా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో మార్కెట్లోకి రానున్నాయి.
కొత్త రంగు – కొత్త లుక్ – అదిరిపోయే నోట్ల ప్రింటింగ్
ఇప్పటికే డీమానిటైజేషన్ తర్వాత వచ్చిన కొత్త రూ.500 నోట్లు స్టోన్ గ్రే రంగులో ఉన్నాయ్. కానీ ఇప్పుడు వచ్చే నోట్లలో రంగు, సైజు, డిజైన్ మొత్తం మారిపోవచ్చు. తాజా సమాచారం ప్రకారం కొత్త నోట్ సైజు 66mm x 150mm ఉండబోతుంది. ఎప్పుడూ చూస్తున్నట్టే కాకుండా ఈసారి మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది.
ఇంతకీ లాభం ఎలా?
కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు కొంతకాలం డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో పాత నోట్లను మారుస్తూ స్మార్ట్‌గా వ్యవహరిస్తే మీరు రూ.500 పెట్టుబడి పెడితే రూ.5,000 వరకూ మారకం లాభం పొందే అవకాశం ఉంటుంది. డిమాండ్ టైంలో సరైన చోట సరైన వ్యాపారం అంటే ఇదే..
సూచన: నోట్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం, లేదా బ్లాక్ మార్కెట్‌లో డీల్ చేయడం చట్టరీత్యా నిషిద్ధం. చట్టబద్ధ మార్గాల్లో అవకాశాన్ని వినియోగించుకోండి.