దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి MBBS మరియు BDS కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన NEET UG 2024 పరీక్ష యొక్క admit cards లను National Testing Agency విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమapplication number, date of birth, course, security pin వివరాలను నమోదు చేయడం ద్వారా NEET UG యొక్క అధికారిక వెబ్సైట్ నుండి admit cards లను download చేసుకోవచ్చు.
ఈ ఏడాది పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో 10 లక్షల మంది బాలురు, 13 లక్షల మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ దేశవ్యాప్తంగా 571 కేంద్రాలు, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. NEET UG exam May 5న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 05:20 వరకు పెన్ మరియు పేపర్ విధానంలో జరుగుతుంది.
Exam 200 నిమిషాలు అంటే 3 గంటల 20 నిమిషాల పాటు జరుగుతుంది. ప్రశ్నపత్రం English, Hindi and Telugu తో పాటు మొత్తం 13 భారతీయ భాషల్లో ఉంటుంది. ఈ పరీక్ష Offline mode లో పెన్ మరియు పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది. NEET UG పరీక్షలో 720 మార్కులకు 180 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. MBBS, BDS, BSMS, BUMS and BHMS courses ప్రవేశాల కోసం ప్రతి ఏడాది నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి పైగా విద్యార్థులు NEET UG పరీక్షకు హాజరవుతారు.