ఇప్పటి ఆర్థిక పరిస్థితుల్లో చాలా మంది పర్సనల్ లోన్ అవసరంగా భావిస్తున్నారు. అవాంఛిత ఖర్చులు, హెల్త్ ఎమర్జెన్సీస్, మ్యారేజ్ ఖర్చులు, లేదా ఇతర ఆర్థిక అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుంది. అయితే, లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు సరిపోల్చుకోవడం చాలా ముఖ్యం.
ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు పర్సనల్ లోన్‌పై అందిస్తున్న వడ్డీ రేట్లు ఇవే:
బ్యాంక్ పేరు | వడ్డీ రేటు (సగటు శాతం) |
---|---|
SBI | 11.15% – 15.30% |
HDFC Bank | 10.50% – 21.00% |
ICICI Bank | 10.75% – 19.00% |
Axis Bank | 10.49% – 22.00% |
Kotak Mahindra Bank | 10.99% – 20.99% |
Punjab National Bank | 11.45% – 16.95% |
Bank of Baroda | 10.90% – 16.55% |
IDBI Bank | 9.50% – 14.00% |
పర్సనల్ లోన్ తీసుకోవడానికి మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, బ్యాంక్ విధానాలు ప్రభావం చూపుతాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందే అవకాశం ఉంటుంది.
Related News
పర్సనల్ లోన్ తీసుకునే ముందు మీకు కావలసిన మొత్తం మరియు మీరు ఎప్పటి వరకు అయితే రుణం తీర్చాలి అనుకుంటున్నారో అన్ని విషయాలు సక్రమంగా తెలుసుకోవడం మంచిది. హడావుడిగా ఏ బ్యాంక్ నుంచైనా లోన్ తీసుకోవద్దు. మీరు ఎంపిక చేసే బ్యాంక్ యొక్క ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ రీపేమెంట్ నిబంధనలు, ముందుగానే చెల్లించే ఛార్జీలు వంటి అంశాలను పరిశీలించాలి.
తక్కువ వడ్డీ రేటుతో మంచి లోన్ ఆఫర్ దొరికితే, అదును చేసుకోవడానికి ఆలస్యం చేయకండి. మీరు సరైన ప్లాన్ చేసుకుని అప్పు చేస్తే ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు.