Nandigam Suresh: నందిగం సురేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం కీలక తీర్పు

మరియమ్మ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈరోజు (మంగళవారం) నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మరియమ్మ హత్య కేసులో నందిగాం సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు పింఛన్‌ నిలిపివేసి ఇల్లు కూడా ఇవ్వలేదని మరియమ్మ ఆరోపించారు. మరిమ్మ ఇంటిపై దాడి చేసి నందిగాం సురేష్ అనుచరులు హత్య చేశారు.

దీనిపై అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2020 నుంచి పోలీసులు విచారణ చేపట్టకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నారా లోకేష్ మరియమ్మ కుమారుడిని కలిసి తనకు న్యాయం చేయాలని విన్నవించారు. మరియమ్మ మృతికి సంబంధించిన వివరాలను, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును మరియమ్మ కుమారుడు తెలిపాడు. ఈ హత్య కేసులో సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

కేసు తీవ్రత దృష్ట్యా సురేశ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు తీర్పును నందిగాం సురేష్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు (మంగళవారం) విచారణ చేపట్టింది. సురేష్ తన పాత కేసుల వివరాలను ఎందుకు దాచారని ప్రశ్నించింది. ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయనందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చార్జిషీటు కూడా దాఖలు కావడంతో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *